వివిధ ప్రభుత్వ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఏపియం, పంచాయతీ సెక్రటరీలతో, బ్యాంక్ లింకేజీ, ఉన్నతి, పీఎంఈజిపి, శ్రీనిధి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బాపట్ల పట్టణాన్ని మరింత పచ్చదనంతో అభివృద్ధి చేసి, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, పార్కులు, ఖాళీ స్థలాల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యోగ్రాంధ్ర కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. 9వ తేదీన బాపట్ల సూర్యలంకలోని నగర వనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 10న పట్టణంలోని భావన్నారాయణ గుడి వద్ద, 11వ తేదీన చీరాల వాడరేవు బీచ్ వద్ద, 12న పర్చూరులోని నాంచారమ్మ గుడి వద్ద, 14న పీవీ పాలెం మండలం కేర్ నాచురోపతి కళాశాలలో, 15వ తేదీన మున్సిపల్ పాఠశాల ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో, 17వ తేదీన బాపట్ల గురుకుల పాఠశాలలో, 18న భట్టిప్రోలు మండలం బౌద్ధ స్తూపం వద్ద, 21న జిల్లాస్థాయిలో యోగాంధ్ర ముగింపు కార్యక్రమం సూర్యలంక బీచ్ లో నిర్వహిస్తున్నామన్నారు. అధికారులు సమష్టిగా పనిచేయాలన్నారు. జిల్లా అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్లటౌన్: ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 193 మంది బాధితులు జిల్లా కలెక్టర్‌ను కలిసి అర్జీలు అందజేశారు. బాధితులకు సత్వరమే న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, తదుపరి పరిష్కరించాలన్నారు. ఇన్‌చార్జ్ జేసీ, డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీపీఓ ప్రభాకర్ రావు పాల్గొన్నారు.


