రెంటచింతలలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిర్మానుష్యంగా మారిన మాచర్ల–గుంటూరు రహదారి
గుంటూరులో ఎండలు మండిపోవడంతో గొడుగులు ఉపయోగిస్తున్న మహిళలు, సోడా బండి వద్ద వే చి చూస్తున్న కొనుగోలుదారులు
కొద్ది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎల్‌నినో ప్రభావం వలన ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఉదయం 10 గంటల నుంచే తీవ్రత పెరిగింది. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలలో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలుగా నమోదైంది. మధ్యాహ్న సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి కొబ్బరిబొండాలు, చెరుకురసం, శీతల పానీయాల దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు/ రెంటచింతల


