పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన వైఎస్‌ జగన్‌ | - | Sakshi
Sakshi News home page

పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన వైఎస్‌ జగన్‌

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, డైమండ్‌ బాబు తన పరిపాలనలో అట్టడుగు వర్గాలకు పెద్దపీట వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు

గుంటూరు ఎడ్యుకేషన్‌ : అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పరిపాలనలో ఆచరణలో పెట్టారని వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవన్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. శనివారం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్‌ బాబు)లతో కలసి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితమే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని, అణగారిన, అట్టడుగు వర్గాల్లో అంటరానితనాన్ని పారద్రోలి సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ముందుకు వెళ్లేందుకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు. 1848లోనే సీ్త్ర విద్య కోసం తన సతీమణి సావిత్రిబాయి పూలేకు అండగా నిలిచి, ప్రత్యేకంగా విద్యాసంస్థలను స్థాపించేందుకు కృషి చేశారని అన్నారు. జ్యోతిరావు పూలే ఆశించిన విధంగా అట్టడుగు వర్గాల సంక్షేమం, రాజకీయంగాచైతన్య, చట్టసభల్లో ప్రాధాన్యాన్ని వైఎస్‌ జగన్‌మోన్‌రెడ్డి గత ప్రభుత్వంలో ఆచరణలో చూపించారని అన్నారు. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన ఏకై క ముఖ్యమంత్రిగా నిలిచారని, రాష్ట్రంలో జ్యోతిరావ్‌ పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ హక్కు ఉందన్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా బీసీ విభాగ అధ్యక్షడు తాడిబోయిన వేణుగోపాల్‌ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. బీసీలకు న్యాయం చేసి, అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన వ్యక్తిగా వైఎస్‌ జగన్‌ నిలిచారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement