ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ సంవత్సరానికి రెండేళ్ళ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సులలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను దూరవిద్య కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ విడుదల చేశారు.
ప్రవేశ పరీక్ష కేంద్రాలు:
సెంటర్ ఫర్ డిస్టెనన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్ (కాకినాడ), ఎంఎస్‌ఆర్‌ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్ (ఒంగోలు), గేట్ డిగ్రీ కాలేజ్ (తిరుపతి), విజయ దుర్గ డిగ్రీ కాలేజ్ (కర్నూలు), ఇంటెల్ ఇంజనీరింగ్ కాలేజ్ (అనంతపూర్), విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ (కై కలూరు), చక్రధర్ డిగ్రీ కాలేజ్ (మాచర్ల), ఎస్బీఎస్‌వైఎం డిగ్రీ కాలేజ్( మైదుకూరు), ప్రభాస్ డిగ్రీ కాలేజీ (విజయవాడ), శాంతినికేతన్ డిగ్రీ కాలేజీ (శ్రీకాకుళం) మొత్తం 12 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.
ఏపీ ఐసెట్ 2025లో అర్హులకు మినహాయింపు..
ఏపీ ఐసెట్–2025లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వర్సిటీ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను, ర్యాంక్ కార్డులు పొందవచ్చని దిట్టకవి ఆచార్య రామచంద్రన్ పేర్కొన్నారు.


