క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుతోనే జిల్లా పురోభివృద్ధి
బాపట్ల: క్షేత్రస్థాయి సిబ్బంది పని తీరుతోనే వ్యవసాయ రంగం, జిల్లా పురోభివృద్ధి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. జాతీయ ఆహార భద్రత, పోషకాహార లోపం నివారణ ప్రత్యేక కార్యక్రమాలపై మండల వ్యవసాయ అధికారులతో శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న రైస్ మిల్లర్ల అసోసియేషన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారులు రూపొందించిన నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్, వీఏవోలు రూపొందించిన క్యాలెండర్‌లను కలెక్టర్ విడుదల చేశారు. యూరియా అధికంగా వినియోగించడంతో వచ్చే నష్టాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన పోస్టర్‌లను కలెక్టర్ ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు ఆధునికీకరణను సంతరించుకుంటూ అధికారులు బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు.
బానిస కూలీల వ్యవస్థ జిల్లాలో నిర్మూలించడం, వెట్టి చాకిరి నుంచి విముక్తి, పునరావాసం కల్పించడమే అధికారుల లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో బానిస కూలీల వ్యవస్థ నిర్మూ లన కమిటీ, జిల్లాస్థాయి బాల కార్మిక నిర్మూలన కమిటీ, జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ, ఇ–శ్రమ జిల్లాస్థాయి కమిటీల సమావేశం నిర్వహించారు. వెట్టిచాకిరి లేని, బాల కార్మిక రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దే బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.
బాపట్ల నగరంలో ప్రజల సౌకర్యార్థం పెట్రోల్ బంక్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ స్థల పరిశీలన చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. బాపట్ల నగరంలోని పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. గతంలో ఈ ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఉండేదని, ఆ పెట్రోల్ బంక్ రోడ్డు విస్తీర్ణలో తొలగించారని, పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఇచ్చిన స్థల లీజు కాల పరిమితి కూడా పూర్తి అయిందని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్‌కు వివరించారు.
బానిస కూలీల వ్యవస్థ నిర్మూలించాలి
పెట్రోల్ బంకు నిర్మాణానికి స్థల పరిశీలన
వేగంగా రీ సర్వే
పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ
రాజముద్రతో రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, మండల తహసీల్దార్లతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రీ సర్వే పట్టాదారు పాసు పుస్తకాలను ఈనెల 12వ తేదీలోగా లబ్ధిదారులకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంపిణీ కార్యక్రమంలో ఈకైవెసీ ప్రక్రియ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.
వీఆర్వోల పనితీరులో మార్పు రావాలి
ఐవీఎస్ సర్వేలో 13 మంది వీఆర్‌వోలు కేవలం 50 శాతం పనితీరు చూపడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సమయానికి నిర్లక్ష్యం లేకుండా మెరుగైన సేవలు అందించాలని వీఆర్‌వోలను ఆదేశించారు. 13 మంది వీఆర్‌వోలతో సమావేశం నిర్వహించి, పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులు
జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్‌ల్లో ప్రయాణికుల కు సీటింగ్, వెయిటింగ్, తాగునీరు, మరుగు దొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్