దేవాలయాల్లో చోరీ
నరసరావుపేటటౌన్: రెండు దేవాలయాల్లో తాళాలు పగులగొట్టి హూండీలలో నగదు అపహరించుకు వెళ్లిన సంఘటన శుక్రవారం పట్టణంలో వెలుగు చూసింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపురంలో బ్రహ్మంగారి గుడి, రాములవారి దేవస్థానం పక్కపక్కనే ఉంటాయి. అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు రాములవారి గుడి గేటు తాళాలు పగలగొట్టి హుండీ అపహరించాడు. అందులోని నగదు తీసుకొని హుండీని గుడి వెనుక ప్రాంతంలో పడవేశాడు. అదే విధంగా బ్రహ్మంగారి గుడిలోని హుండీ పగలగొట్టి అందులో నగదు తీసుకున్నాడు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త హనుమాన్ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ ఫిరోజ్, ఎస్‌ఐ వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకొని హుండీపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు.
రెండు హుండీల్లో నగదు అపహరణ
దేవాలయాల్లో చోరీ


