బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Jan 11 2026 7:35 AM | Updated on Jan 11 2026 7:35 AM

బాపట్

బాపట్ల

ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026 కోర్టు ప్రాంగణాలు మురిసే.. నిమ్మకాయల ధరలు పర్యాటకుల సందడి

న్యూస్‌రీల్‌

కోర్టు కాంప్లెక్స్‌లో సంక్రాంతి సంబరాలు కులమతాలకతీతంగా హాజరు ముగ్గులు వేసిన మహిళా న్యాయవాదులు అలరించిన సంగీత విభావరి విజేతలకు బహుమతులు అందజేసిన న్యాయమూర్తులు

ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
రంగవల్లి విరిసే..
కోర్టు ప్రాంగణాలు మురిసే..

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.3200, మోడల్‌ ధర రూ.2400 వరకు పలికింది.

విజయపురిసౌత్‌: నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. లాంచీస్టేషన్‌కు రూ.2,73,950 ఆదాయం సమకూరినట్లు యూనిట్‌ మేనేజర్‌ కె.మస్తాన్‌బాబు తెలిపారు.

బాపట్ల: బాపట్ల జిల్లా కోర్టు ప్రాంగణాలు సంక్రాంతి సంబరాలతో అలరారాయి. కుల మతాలకతీతంగా న్యాయవాదులు సాంప్రదాయ దుస్తులలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రాంగణాన్ని ముత్యాలముగ్గులతో అలంకరించారు. తెల్లవారుజామున భోగి మంటలతో ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో కోర్టు ప్రాంగణం సరికొత్త సాంప్రదాయాలకు వేదికగా నిలిచింది. న్యాయవాదులతో సమానంగా న్యాయమూర్తులు ఆయా వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. సాంప్రదాయ క్రీడల్లో పాల్గొంటూ.. సరికొత్త సంస్కృతి, సాంప్రదాయాలకు వేదికగా కోర్టు కాంప్లెక్స్‌ను మార్చారు. ప్రతిరోజు కక్షిదారులు, కేకలు, చట్టాలు, ఒకరిపై ఒకరు వేసుకునే ఎత్తులు, పై ఎత్తులు తో కోర్టు ప్రాంగణాల్లో చదరంగం ఆడే న్యాయవాదులు, రోజువారి ఒత్తిడికి దూరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.

సంక్రాంతి సంబరాలకు శ్రీకారం...

బాపట్ల జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు. సీనియర్లు, జూనియర్లు అనే భేదం లేకుండా, కోర్టు ఉద్యోగులతో కలిసిపోయి, సాంప్రదాయ క్రీడల్లో పాల్గొంటూ మురిసిపోయారు. న్యాయమూర్తులు సైతం న్యాయవాదులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, సంబరాలకు సహకారాన్ని అందించారు. పురుష న్యాయవాదులతో సమానంగా పోటీపడి మహిళా న్యాయవాదులు క్రీడలలో పాల్గొని అనేక బహుమతులు సాధించారు. న్యాయవాదులతోపాటు గుమస్తాలు, కోర్టు ఉద్యోగులు ఆయా పోటీలలో పాల్గొని ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు.

సంక్రాంతి అంటేనే పల్లె పండుగ...

ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే, పల్లె పండుగ, సంబరాల పండుగ, అలాంటి సంబరాలు రోజువారి ఒత్తిడి నుంచి బయటపడి, సరికొత్త జీవనయానానికి, దోహదపడతాయని నిర్వాహకులను అభినందించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఆటల పోటీలలో విజేతలకు న్యాయమూర్తులు కె.శ్యాంబాబు, వాణి, పవన్‌ కుమార్‌, ఎం.కళ్యాణిలు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమాలలో బాపట్ల జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అవినాష్‌, న్యాయవాదులు విన్నకోట సత్యప్రసాద్‌, బి.స్టాన్లీ విమల్‌ కుమార్‌, కె.రవిబాబు, బెంజ్‌, శ్యామలదేవి, కత్తి నాగలక్ష్మి, దుర్గ అంబిక, అనూష, నాగమోహిని, టి.రాఘవేంద్రనాథ్‌, దుద్దుకూరి భాస్కరరావు, కె.సురేంద్ర, రామిడి వెంకటేశ్వర్లు, నల్లమోతు సుబ్బారావు, భీమా లీలాకృష్ణ, రామకోటి, పల్లప్రోలు మురళీ తదితరులు పాల్గొన్నారు.

I

ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సురేష్‌రెడ్డి

తిరుపతి మాతాజీ రమ్యానందభారతి

బాపట్ల1
1/7

బాపట్ల

బాపట్ల2
2/7

బాపట్ల

బాపట్ల3
3/7

బాపట్ల

బాపట్ల4
4/7

బాపట్ల

బాపట్ల5
5/7

బాపట్ల

బాపట్ల6
6/7

బాపట్ల

బాపట్ల7
7/7

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement