తీరంలో సినిమా షూటింగ్ సందడి
చీరాల రూరల్: చీరాల వాడరేవు తీరంలో ఆదివారం సినిమా షూటింగ్ జరగడంతో సందడి వాతావారణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సముద్ర స్నానానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. షూటింగ్ చూడటానికి ఆసక్తి చూపారు. తమ సినిమా విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకోనుందని డైరెక్టర్ భీంజి తెలిపారు. శ్రీసుధార క్రియేషన్స్ బ్యానరుపై మాస్టర్ కనిష్క సమర్పిస్తున్న ఈ సినిమాలో అనంతనేని శ్రీనివాస్, మౌనిక శర్మ జంటగా నటిస్తున్నారని పేర్కొన్నారు. ఇతర పాత్రల్లో సుహాసినీ మణిరత్నం, వినోద్‌కుమార్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నట్లు తెలిపారు. కొరియోగ్రఫీ సంతోష్, బాలకృష్ణ, ఫైట్స్ రాజు సమకూరుస్తున్నట్లు ఆయన వివరించారు. పి.నాగరాజు నిర్మాత అని తెలిపారు.


