నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
నగరం: నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి డాక్టర్ సీహెచ్ నరేష్‌కుమార్ తెలిపారు. స్థానిక స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాటుసారా తయారీ కేంద్రాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎమ్మార్పీకి మద్యం విక్రయించేలా ఎకై ్సజ్ అధికారులు కృషి చేయాలని కోరారు. అక్రమ మద్యం అమ్మకాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన తరువాతే మద్యం అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం షాపుల సమయాన్ని రాత్రి 10 నుంచి 12 గంటల వరకు పెంచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, సీఐ మార్టూరి శ్రీరామ్‌ప్రసాద్, ఎస్‌ఐ విజయలక్ష్మి పాల్గొన్నారు.


