
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
బాపట్ల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభవంతుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతుల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక గ్రీవెనన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వెరిఫికేషనన్‌్‌లో తొలగించిన వికలాంగుల పింఛన్‌దారులకు మరో అవకాశం కల్పిస్తామన్నారు. విభిన్న ప్రతిభావంతులు పెన్షన్ల కోసం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల దగ్గర అప్పీల్ చేసుకోవచ్చన్నారు. విభిన్న ప్రతిభావంతులకు తిరిగి వెరిఫికేషనన్ ద్వారా పింఛన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధామాధవి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్వామిత్వ సర్వే వేగం పెంచండి
జిల్లాలో స్వామిత్వ సర్వేపై కలెక్టర్ జె.వెంకట మురళి శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో డ్రోన్ సర్వే పనులను వేగవంతం చేయాలని, పూర్తయిన గ్రామాల్లో హక్కు పత్రాలను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. సర్వేలో తలెత్తే వివాదాలు, అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సర్వే ద్వారా ప్రజలకు తమ ఆస్తులపై స్పష్టమైన హక్కులు లభిస్తాయని, తద్వారా వారు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు. పంచాయతీలకు సొంత ఆదాయాన్ని పెంచుతుందని తెలిపారు. సమావేశంలో సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ కనకప్రసాద్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు గ్లోరియ, చంద్రశేఖర్, రామలక్ష్మి, డీపీవో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి లక్ష్యాలు,
సాధించిన పురోగతి నిక్షిప్తం చేయాలి
అభివృద్ధి లక్ష్యాలు, సాధించిన పురోగతిపై ఎప్పటికప్పుడు కేపీఐసీలో నిక్షిప్తం చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని చెప్పారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో వెయ్యి మొక్కలు నాటాలని కలెక్టర్ తెలిపారు. అటవీ శాఖ అధికారులు, డ్వామా అధికారులు సమన్వయంతో మొక్కలు నాటాలని సూచించారు. సమావేశంలో సీపీఓ షాలేమ్ రాజు, డీపీఓ ప్రభాకరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూగర్భ జలమట్టం పెరిగేలా ప్రణాళికలు తయారు చేయాలి
భూగర్భ జల మట్టం జిల్లాలో మరింత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. జల వనరులు, భూగర్భ జలశాఖ అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రానైట్ క్వారీలు, మట్టి, కంకర తవ్వకాల ప్రభావంతో పర్యావరణం సమతుల్యత కోల్పోయి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. వాటిని పెంచడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని మండలాలలో పంట కాల్వల మధ్యలో బోర్లు వేసి భూగర్భ జలాలు పెరగడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కొల్లూరు మండలంలోనూ భూగర్భ జలమట్టం తగ్గడంపై ఆరా తీశారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలమట్టం తగ్గుతుందని ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వాటిని అరికడుతూనే భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాపట్ల పట్టణం తాగునీటి చెరువు కట్ట బలోపేతం, పూడికతీత పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రూ.ఎనిమిది కోట్ల నిధులతో తయారుచేసిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి తక్షణమే పంపాలన్నారు. సమావేశంలో జల వనరులశాఖ ఎస్‌ఈ అబూతలీమ్, భూగర్భ జల శాఖ ఏడీ సురేష్, డ్వామా పీడీ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి