
శాంతించిన కృష్ణమ్మ
ఊపిరి పీల్చుకుంటున్న లంక గ్రామాల రైతులు
భట్టిప్రోలు: కృష్ణమ్మ శాంతించింది. దీంతో లంక గ్రామాల రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగువకు శుక్రవారం మధ్యాహ్నం 4.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. మండలంలోని ఓలేరు, పల్లెపాలెం, పెదలంక కాకుల డొంక వద్ద వరద తగ్గుముఖం పట్టింది. పొలాల్లో నిలిచిన నీరు వెనక్కి వెళుతుండడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు చర్యలు చేపట్టారు. చప్టాలపై నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను, నాటు పడవలను అందుబాటులో ఉంచారు. వీఆర్వోలు, ఇన్‌చార్జి ఆర్‌ఐ శివరామకృష్ణ, మండ్రు జక్రయ్య, ఎల్.సురేష్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు.