
బార్ అండ్ రెస్టారెంట్ల అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి
రేపల్లె: ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన బార్ పాలసీకి రేపల్లె పట్టణంలో నాలుగు బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతులు లభించాయని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు చెప్పారు. స్థానిక ప్రొహిబిషన్ కార్యాలయంలో శుక్రవారం రెస్టారెంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే వారితో సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు మూడు సంవత్సరాలపాటు బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేవారు రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజు, రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. బార్లకు అందిన దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సమక్షంలో బాపట్లలో లాటరీ విధానంలో ఎంపిక చేస్తారని తెలిపారు. బార్ పాలసీ విధి విధానాలను తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి బి.వెంకటేశ్వర్లు, సీఐ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు