
ఫొటోకు జీవం పోస్తాడు పీవీఎస్
బాపట్లటౌన్/బాపట్లఅర్బన్: జీవితంలోని మధుర స్మృతులన్నీ దాచుకునే దృశ్య సంచిక ఫొటో..బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పీవీఎస్ నాగరాజు తన చేతిలోని కెమెరాను క్లిక్ మనిపిస్తే చాలు...మండలం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఏదో ఒక అవార్డు సాధించడం ఖాయం. గ్రామీణ ప్రాంతాల ప్రజల స్థితిగతులు, జీవ వైవిధ్యం, ప్రకృతి సౌందర్యాలు, గిరిజనుల జీవన విధానం, భారతీయ సంస్కృతి, గిరిజనుల జీవన పోరాటం, తీరప్రాంతాల్లోని మత్స్యకారుల జీవన స్థితిగతులు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పడేపాట్లు ఇలా సహజ సిద్ధంతో కూడిన ఛాయాచిత్రాలను తన కెమెరాలో బంధించడం అతని అలవాటు. పీవీఎస్ తీసిన ఫొటోలకు ఇప్పటివరకు 207 అవార్డులు లభించాయి. వాటిల్లో రాష్ట్రస్థాయిలో 19, జాతీయస్థాయిలో 105, అంతర్జాతీయ స్థాయిలో 83 చొప్పున అవార్డులు లభించాయి. తాను తీసిన ఛాయాచిత్రాలకు లభించిన అవార్డులను గుర్తించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2024లో పీవీఎస్ నాగరాజుకు డాక్టరేట్ అందజేశారు.
ఫొటోగ్రఫీలో పీవీఎస్ నాగరాజుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం

ఫొటోకు జీవం పోస్తాడు పీవీఎస్