
రోగులకు సహనంతో సేవలు అందించాలి
రేపల్లె: ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు సహనంతో వైద్య సేవలను అందించాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి పద్మావతి పేర్కొన్నారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు అధికంగా అయ్యేలా పనిచేయాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్నందున జాగ్రత్త వహించి వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యశాలలో సదుపాయాలన్నీ అందుబాటులో ఉంచాలన్నారు. వైద్యశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వైద్యశాలలో రికార్డులు పరిశీలించి వివిధ రోగుల గదులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ సుధాకరం, వైద్యులు గణేష్, జీవన్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి పద్మావతి