ఇద్దరు యువకులకు గాయాలు
వేటపాలెం: రోడ్డు పక్కన ఆగి ఉన్న మోటార్ బైక్‌ను వెనక నుంచి వచ్చిన టూరిస్టు బస్ ఢీకొట్టిన సంఘంటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. జాతీయ రహదారి 216 బైపాస్ రోడ్డులో పొట్టి సుబ్బయ్యపాలెం జంక్షన్ వద్ద ఆదివారం సంఘటన చోటు చేసుకుంది. తెనాలి వైపు నుంచి నెల్లూరు వెళుతున్న టూరిస్టు బస్ జంక్షన్ వద్ద రోడ్డు పక్కన బైక్ ఆపుకుని ఉన్న రాపూరి బాలాజీ, డేవిడ్‌లను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఎగిరి రోడ్డుపై పడటంతో తలలకు గాయాలయ్యాయి. స్థానికులు 104కు సమాచారం ఇవ్వగా, యువకులను అంబులెన్స్‌లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్ బాపట్లలో నిర్వహణ
రాష్ట్ర అధ్యక్షుడు షేక్ లాల్‌వజీర్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్‌ను త్వరలో బాపట్లలో నిర్వహిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు షేక్ లాల్‌వజీర్ తెలిపారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈసీ మీటింగ్‌లో వజీర్ మాట్లాడుతూ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. వెటరన్స్ అథ్లెటిక్ మీట్‌కు శాప్ నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామన్నారు. సీనియర్ అథ్లెట్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర పోటీల్లో విజేతలను త్వరలో రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో జరగనున్న జాతీయ పోటీలకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో మాదిలేటి రెడ్డి, నజీర్, గిరి, డాక్టర్ పురుషోత్తం, నగేష్ ఖన్నా, లక్ష్మి, మల్లికా తదితరులు పాల్గొన్నారు.
కరాటేలో మంగళగిరి క్రీడాకారుల ప్రతిభ
మంగళగిరి టౌన్: ఆల్ ఇండియా కరాటే చాంపియన్ షిప్–2025 పోటీల్లో మంగళగిరికి చెందిన క్రీడాకారులు ప్రతిభ చాటారని కోచ్ డి.ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సిద్ధ్దార్థ కరాటే అకాడమీ ఒంగోలులో నిర్వహించిన 43 యూనివర్సిటీ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో ఆదివారం మంగళగిరికి చెందిన క్రీడాకారులు పోటీలలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అండర్–10 విభాగంలో హర్ష గోల్డ్ మెడల్, జయదేవ్ బ్రాంజ్ మెడల్, అండర్–9 విభాగంలో నిఖిలేష్ బ్రాంజ్ మెడల్, అండర్–7 విభాగంలో ఈశ్వర్ బ్రాంజ్ మెడల్, అండర్–14 విభాగంలో చరణ్ బ్రాంజ్ మెడల్ సాధించారని తెలిపారు. బాలికల అండర్–7 విభాగంలో శ్రీవల్లి సిల్వర్ మెడల్, శ్రీదుర్తి బ్రాంజ్ మెడల్, అండర్–9 బాలికల విభాగంలో ఉపజ్ఞ సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నట్లు తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను మంగళగిరి ఎంఎంకే స్టేడియం ప్రతినిధులు అభినందించారు.

కరాటేలో మంగళగిరి క్రీడాకారుల ప్రతిభ