
దేశ సేవకు యువత సంసిద్ధులై ఉండాలి
అమరవీరుల త్యాగాలు వృథా కాకూడదు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ
బాపట్లటౌన్: దేశ సేవకు యువత సంసిద్ధులై ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్ర వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుషార్‌డూడీ జెండా ఏగురవే శా రు. ఎస్పీ మాట్లాడుతూ రెండు వందల ఏళ్ల పాటు సాగిన బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవిచూసిన భారత దేశం, ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితంగా 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రం వారి త్యాగ ఫలితమేనని, స్వతంత్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత ఎల్లవేళలా దేశ సేవ కు సంసిద్ధులై ఉండాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మనవంతు కృషి చేయాలన్నారు. త్యాగధనులు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో.. ఆ కలలను మనమందరం సాకారం చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయానికి విచ్చేసిన విద్యార్థులకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, డీపీఓ అధికారులకు మిఠాయిలను పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఏవో బి. శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, ఏఆర్ డీఎస్పీ పి. విజయసారధి, ఎస్‌బీ సీఐ నారాయణ, ఆర్‌ఐలు షేక్ మౌలుద్దీన్, టి.శ్రీకాంత్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.