
తప్పిపోయిన తల్లిని కొడుకు వద్దకు చేర్చిన షీ టీం
చీరాల అర్బన్: తప్పిపోయిన తల్లిని కొడుకు చెంతకు చేర్చారు చీరాల షీ టీం పోలీసులు. వివరాల్లోకి వెళితే.. బీహార్ నుంచి తప్పిపోయి 13 రోజుల కిందట వృద్ధురాలు రామ్‌కుమార్ దేవి చీరాలకు వచ్చింది. చీరాల సంపత్‌నగర్‌లోని ఓ షాపు ఎదురుగా ఉంటూ అర్థం కాని భాషలో ఏడుస్తుండేది. స్థానికులు గుర్తించి ఆమె యాచకురాలుగా లేదని భావించి ఆమెకు ఆహారం అందించారు. రోజులు గడచినా ఆమె బంధువులు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. షీ టీం ఎస్సై హరిబాబు తమ బృందంతో బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విచారణ చేశారు. ఎట్టకేలకు ఆమె బీహార్ వాసిగా గుర్తించి ఆమె కుమారుడు అనిల్ సింగ్‌ను చీరాలకు రప్పించి సురక్షితంగా ఆమెకు కొడుకు చెంతకు చేర్చారు. ప్రత్యేక శ్రద్ధ చూపిన పోలీసులను స్థానికులు అభినందించారు.
స్వాతంత్య్రం రోజు ఏరులై పారిన మద్యం
చీరాల: స్వాతంత్య్ర దినోత్సవం సమయా న చీరాల ప్రాంతంలో మద్యం ఏరులై పారింది. మద్యం షాపులు మూసివేయాలనే నిబంధన ఉన్నా అమ్మ కాలు సాగాయి. ఎమ్మార్పీ కంటే రూ.30 నుంచి రూ.50 అదనంతో అమ్మకాలు చేపట్టారు. మద్యం షాపులు బయటే గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగించారు. పట్టణంలోని పలు వైన్ షాపుల ముందు ఇదే తంతు నడిచింది. జేబుల్లో, బ్యాగుల్లో, ద్విచక్రవాహనాల్లో పెట్టుకుని అమ్మకాలు సాగించారు.

తప్పిపోయిన తల్లిని కొడుకు వద్దకు చేర్చిన షీ టీం

తప్పిపోయిన తల్లిని కొడుకు వద్దకు చేర్చిన షీ టీం