
సంక్షుభిత వేళ సాహితీవేత్తలపై బృహత్తర కర్తవ్యం
తెనాలి: ప్రపంచంలో ప్రమాదకర పరిణామాలు జరుగుతున్న సందర్భంలో సాహితీవేత్తలపై గొప్ప కర్తవ్యాలు ఉన్నాయని ‘అరసం’ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. కశ్మీర్‌లో కొన్ని గ్రంథాలను నిషేధించారని చెబుతూ రచయితలు, సాహితీవేత్తలపై అప్రకటిత నిషేధం, అక్రమ అరెస్టులు దారుణమన్నారు. ‘అరసం’, తెనాలి శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఏర్పాటైన సభలో ప్రముఖ దళిత సీ్త్రవాద రచయిత్రి ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి కవితా సంపుటి ‘అల్లిక’ను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. సభకు జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్‌హర్ అధ్యక్షత వహించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో నిషేధాలు, అరెస్టులు కొత్త కాదన్నారు. చీకట్లోకి వెళుతున్న ఈ దేశాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అన్ని రకాల అమానవీయతలతోపాటు యువత గంజాయికి, మత్తుకు బానిసలవుతుంటే దేశం ఏమవుతుంది? మరోవైపు మనుషుల మధ్య ప్రేమరాహిత్యం కూ డా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో సొంతూరు పాపర్రు నుంచి ఇజ్రాయెల్ వరకు అంశాలతో స్వరూపరాణి రాసిన కవితల్లో ప్రాపంచిక, తాత్విక దృష్టి రెండూ కనిపించాయన్నారు.
● బహుజన రచయితల వేదిక డాక్టర్ నూకతోటి రవికుమార్ మాట్లాడుతూ మన బతుకుల్ని మనల్నుంచి లాగేసుకుంటున్నపుడు మాట్లాడకపోవటం చారిత్రక ద్రోహం అవుతుందన్నారు.
● ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ స్వరూపరాణి కవితల్లోని అంశాలనువిశదీకరించా రు.
● కవయిత్రి స్వరూపరాణి మాట్లాడుతూ తనతోటి అణగారిన వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లు, చెమట కలిసినవే తన అక్షరాలుగా చెబుతూ, వివక్ష ఉన్నంతవరకూ రాస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
‘అల్లిక’ పుస్తకావిష్కరణ సభలో అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ