రేపల్లె: ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి పెనుమూడి–పులిగడ్డ వారధిపై చోటుచేసుకుంది. రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు.. నిజాంపట్నం మండలం ప్రజ్ఞాం గ్రామానికి చెందిన పుప్పాల శ్రీనివాస్(55) పట్టణంలోని త్రిబుల్ ఎక్స్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ స్కూల్ సమీపంలోనే నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై శనివారం రాత్రి పులిగడ్డ వైపు నుంచి రేపల్లె వారధిపై వస్తుండగా రేపల్లె నుంచి పులిగడ్డ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా ఢీ కొట్టిందన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వారధిపై లైటింగ్ సౌకర్యం లేకపోవడంతోనే ప్రమాదం సంభవించిందని స్థానికులు పేర్కొంటున్నారు.
30, 31వ తేదీల్లో రాష్ట్ర స్థాయి పికిల్ బాల్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు) : జిల్లా పికిల్ బాల్ అసోసియేషన్, ఏపీ పికిల్ బాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30, 31వ తేదీల్లో రాష్ట్ర స్థాయి పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా చీఫ్ టి.అరుణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 16, 19 బాల బాలికలతోపాటు ఓపెన్ విభాగంలో 35+, 50+, 60+ పురుషులు, మహిళల విభాగాల్లోనూ పోటీలు ఉంటాయన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను చిగురుపాటి రవీంద్ర బాబు, జీవీఎస్ ప్రసాద్, అరుణ్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.
లారీ ఢీకొని ఉపాధ్యాయుడు మృతి