
జోరుగా మట్టి అక్రమ తవ్వకాలు
నగరం: కూటమి నాయకులు యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. మట్టి అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయకుండా ఇషా్‌ుట్నసారం వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన నాయకులు మట్టి మాఫియాగా మారి పచ్చని పంటపొలాలను లోతైన గుంతలుగా మారుస్తున్నారు. సిరులు పండే పంట పొలాలు తవ్వకాలతో ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ శాఖ మంత్రి అండ దండలతో ...
మండలంలోని పెదమట్లపూడి, చినమట్లపూడి, శిరిపూడి కమ్మవారిపాలెం, పూడివాడ గ్రామాలలో కూటమి నేతలు జోరుగా మట్టి వ్యాపారం చేస్తున్నారు. పెద్ద టిప్పర్లతో మట్టిని దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పంట పొలాల్లో సుమారు 20 నుంచి 30 అడుగుల మేర మట్టి తవ్వకాలు చేస్తుండటంతో పక్కన ఉన్న పొలాలు ఎందుకు పనికిరావని రైతులు వాపొతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అండదండలతో మట్టి మాఫియా ఆగడాలకు హద్దు లేకుండా పొతుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. అందుకే అధికారులు మట్టి మాఫియాపై చర్యలు తీసుకోలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
పంట పొలాల్లో ఇష్టానుసారం తవ్వకాలు