ప్రకృతి వనరులను కాపాడుకోవాలి
గుంటూరు వెస్ట్: ప్రకృతి పంచిన అరుదైన వనరులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన చిత్తడి నేలల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని కన్జర్వేటివ్ రిజర్వ్‌గానూ, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలోని మంచినీటి చెరువును చిత్తడి నేలగానూ మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు పంపామన్నారు. వీటిని గ్రామ సభల ద్వారానూ సంబంధిత శాఖాధికారుల ద్వారా ఆమోదం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాల్సి ఉందని తెలిపారు. సమావేశంలో డీపీఓ సాయి కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ నజీమా బేగం, అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ


