ఎదురు దెబ్బ
అమ్మకాలు లేకనే బట్టీలు మూత
న్యూస్‌రీల్
ఎగుమతులు లేకపోవడమే ఉత్పత్తి ఆలస్యానికి కారణం
బాపట్ల
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఇటుక పరిశ్రమకు
ఉపాధి కరువు...
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.900, గరిష్ట ధర రూ.1400, మోడల్ ధర రూ.1100 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 41.6347 టీఎంసీలు.
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు
రేపల్లె: సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు అన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం రేపల్లె పట్టణ, రూరల్ సర్కిల్ కార్యాలయాలను, డీఎస్పీ కార్యాలయాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో, సెల్‌ఫోన్‌లలో వచ్చే లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాల న్నారు. ఈ లింకులను కదిపితే తమ బ్యాంకు ఖాతాలలో నగదుపై ఆశలు వదులుకోవాలన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా గిఫ్ట్ బాక్స్‌ల పేరు తో, ఏపీకే యాప్ పేరుతో వచ్చే మెసేజ్‌లను వెంటనే తొలగించాలన్నారు. ఆయా యాప్‌లను వినియోగిస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుందని చెప్పారు. సైబర్ నేరాలకు గురైన వారు 1930 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. తొలుత ఓల్డ్‌టౌన్‌లో సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, పట్టణ, రూరల్ సీఐలు మల్లికార్జునరావు, సురేష్‌బాబు, ఎస్‌ఐలు రాజశేఖర్, ఆనందరావు, సిబ్బంది పాల్గొన్నారు.
వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
కర్లపాలెం: జాతీయ రహదారిపై వేగ నియంత్రంణకు పోలీస్ సిబ్బంది, హైవే అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ చెప్పారు. బుధవారం ఎస్పీ, డీఎస్పీ, రామాంజనేయులు రూరల్ సీఐ హరికృష్ణతో కలసి కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల పరిధిలో గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనా స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర, చందోలు ఎస్‌ఐ శివకుమార్ యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇటుక అమ్మకాలు రెండేళ్లగా పూర్తిగా మందగించిపోయాయి. అప్పు చేసి తయారు చేసిన ఇటుక కళ్లాల్లోనే మిగిలిపోవడం భారంగా మారింది. ఇటుక దిగుమతి చేసుకున్న వ్యక్తులు నగదు చెల్లించకపోవడం, ఇటుక అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండటంతో పరిశ్రమ నిర్వహణ భారంగా మారి, బట్టీలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– బారెడ్డి సుబ్బారెడ్డి, ఇటుక పరిశ్రమ మాజీ నిర్వాహకులు, కొల్లూరు.
కొల్లూరు: అంతరాష్ట్రీయంగా పేరొందిన కొల్లూరు ఇటుక పరిశ్రమ పరిస్థితి నేడు బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అనే దుస్థితికి చేరుకుంది. ఇటుక పరిశ్రమలు ఇతర ప్రాంతాలలో వ్యాపించడంతోపాటు, అవసరాలకు మించి ఉత్పత్తి.. నిర్మాణ రంగం కుదేలవడం కొల్లూరు ఇటుక పరిశ్రమకు పెను ముప్పులా మారింది. ఇటుక పరిశ్రమకు కొల్లూరు మండలంలోని కృష్ణా నదీ పరివాహక లంక గ్రామాలు నిలయంగా మారాయి. పరిశ్రమ వేలాది మంది రాష్ట్ర, అంతరాష్ట్ర వలస కూలీలతోపాటు, స్థానిక ప్రజల ఉపాధికి ఊతంగా నిలుస్తుంది.
50 పరిశ్రమల వరకు మూత..
డిసెంబర్ నుంచి మే నెల వరకు కొనసాగే ఇటుక ఉత్పత్తి వల్ల ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా రూ.వందల కోట్లలో వ్యాపార లావాదేవీలు జరిగేవి. కొల్లూరు, పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, దోనేపూడి, తోకలవారిపాలెం, తురకపాలెం, తిప్పలకట్ట, పోతార్లంక గ్రామాల పరిధిలో సుమారు రెండు వేలకు పైగా ఎకరాలలో విస్తరించి ఉన్న పరిశ్రమ కుంచించుకుపోవడం ఆరంభమైంది. ఇటుక అమ్మకాలు పడిపోవడం, ఇటుక తయారీకి రూ.5 ఖర్చు అవుతుండగా, అమ్మకాలు సైతం రూ.5 కే జరుగుతుండటంతో ఉత్పత్తిదారులు అప్పులపాలవుతున్నారు. రెండేళ్ల కిత్రం వరకు ఈప్రాంతంలో సుమారు 140 చిన్న, పెద్ద ఇటుక పరిశ్రమలు ఉండగా, నేడు సుమారు 50 పరిశ్రమల వరకు మూతపడ్డాయి. ఏడాదికి సుమారు 30 కోట్ల వరకు ఇటుకలను తయారు చేసిన పరిశ్రమ నేడు సగానికి సగం చేయాలన్నా జంకే పరిస్థితి తలెత్తింది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సమయంలో ఒక్కో ఇటుకరాయి రూ.6కు మించి ధర రావడంతో ఏడాదికి సుమారు రూ.180 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఇటుక కొనే నాథుడే లేకపోవడంతో ఎక్కడ ఇటుక అక్కడ కళ్లాలకే పరిమితమైంది.
అమ్మకాలు మందగించడంతో బట్టీలలోనే నిలిచిపోయిన ఇటుక
7
ఇటుక అమ్మకాలు లేకపోవడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఇటుక బట్టీలలో ఎక్కడ ఇటుక అక్కడే ఉండిపోయింది. సాధారణంగా నవంబర్, డిసెంబరు నెలలో పరిశ్రమ ఆరంభమై ఏప్రిల్ వరకు కొనసాగేది. ఇటుక అమ్మకాలు లేకపోవడంతో కోట్ల సంఖ్యలో నిల్వ ఉండిపోయింది. ఇటుక అలానే ఉండటంతో పెట్టుబడులు భారంగా మారి ఉత్పత్తి ఆలస్యానికి కారణమవుతోంది.
– ఘంట శివరంగారావు,
ఇటుక ఉత్పత్తిదారుడు, కొల్లూరు.
ఇటుక పరిశ్రమల నిర్వహణకు పెద్ద సంఖ్యలో కూలీల అవసరం ఉన్న నేపథ్యంలో వేలది మంది వలస కూలీలు, స్థానిక కూలీలు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఇటుక పరిశ్రమగడ్డు పరిస్థితులకు చేరుకోవడంతోపాటు వేల సంఖ్యలో కూలీలకు ఉపాధి లేకుండా పోతుంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, బాపట్ల, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తదితర జిల్లాలతోపాటు, ఇతర రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌ఘడ్ ప్రాంతాలకు చెందిన సుమారు ఎనిమిది వేల మంది వలస కూలీలు ఇటుక పరిశ్రమలో పనులు చేసేందుకు వస్తారు. వీరికి తోడు స్థానికంగా ఉండే ప్రజలు సుమారు మరో మూడు వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం కొందరు నిర్వాహకులు పరిశ్రమలు కొనసాగించకపోవడంతో కూలీలకు పని దొరకని పరిస్థితి తలెత్తుతుంది.
ఎదురు దెబ్బ
ఎదురు దెబ్బ
ఎదురు దెబ్బ
ఎదురు దెబ్బ
ఎదురు దెబ్బ
ఎదురు దెబ్బ
ఎదురు దెబ్బ
ఎదురు దెబ్బ


