చేదెక్కిన నల్ల చెరకు
పెరిగిన సాగు విస్తీర్ణం దిగుబడి ఆశాజనకం ప్రారంభం కాని తిరునాళ్లు, జాతర్లు ధర పతనం
పదేళ్లుగా సాగుచేస్తున్నా
నాణ్యత బాగున్నా ధరలేదు
క్రిస్మస్ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు బాపట్ల జిల్లాలో క్రైస్తవ లోకం సిద్ధమైంది. దాదాపు పది రోజుల ముందు నుంచే పండుగ హడావుడి ప్రారంభమైంది. చర్చిలను నూతన రంగు లతో అందంగా రూపుదిద్దారు. క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటూ రంగురంగుల కాంతులు చిమ్మే క్రిస్మస్ స్టార్లను వెలిగించారు. జిల్లాలోని చర్చిలన్నీ క్రిస్మస్ పండగ నిర్వహణకు సిద్ధమయ్యాయి. – వేమూరు/భట్టిప్రోలు
బల్లికురవ: ఆహార ధాన్యమైన వరి పంట సాగు పెట్టుబడులు పెరగటం వాణిజ్య పంటల ఆటుపోట్లతో నల్ల చెరకు సాగు విస్తీర్ణం ఏడాదికేడాదికి పెరుగుతోంది. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం నల్లచెరకు సాగుకు అనుకూలంతోపాటు పెట్టింది పేరు. సారవంతమైన నల్లరేగడి భూములు నీటివసతి, బోర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుతో 18 సంవత్సరాలుగా తిరునాళ్లు, జాతర్లలో అమ్మే నల్ల చెరకును సాగు చేస్తున్నారు.
పెరిగిన సాగుతో తగ్గిన ధరలు..
బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు, వైదన, కొప్పెరపాడు, ఎస్‌ఎల్ గుడిపాడు, కొత్తూరు, రామాంజనేయపురం, వెలమవారిపాలెం, అద్దంకి మండలంలోని చక్రాయపాలెం, శింగరకొండపాలెం, గ్రామాల్లో ఈ ఏడాది ఖరీఫ్ జూన్, జూలై, ఆగస్టులో సుమారు 900 ఎకరాల్లో సాగు చేపట్టారు. సొంత భూములతోపాటు కౌలుకు తీసుకొని ఒక్కో రైతు అరెకరా నుంచి రెండు ఎకరాల వరకు పంట సాగు చేపట్టారు. బోదెలు చేసి ఆ బోదెల్లో అడుగు ముక్కలను ఎకరాలకు 12 వేల నుంచి 13 వేల వరకు నాటారు. సస్యరక్షణ నీటి తడులతో గడలు 6 నుంచి 7 అడుగుల వరకు పెరిగి అమ్మకానికి సిద్ధమవుతున్నాయి. వారం రోజులుగా వ్యా పారులే తోటల వద్దకు వచ్చి గడల వంతున కొనుగోలు చేస్తున్నారు.
గతేడాది గడ ఒక్కో టి రూ.16 నుంచి రూ.20 పలకగా నేడు రూ.12 నుంచి రూ.14కి మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తాటిపర్తి అంజిరెడ్డి, భవనం శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రోడ్లపైనే అమ్మకాలు..
చెరుకు గడలకు ధరలు దిగజారటంతో వారం రోజులుగా రోడ్లపైనే అమ్మకాలు చేపడుతున్నారు. మేదరమెట్ల–నార్కెట్‌పల్లి నామ్ రహదారిలోని కొప్పరపాడులో, కొప్పెరపాడు–వినుకొండ రోడ్డులో కూకట్లపల్లి గ్రామ సమీపంలో గడలు కట్టలు కట్టి అమ్మకాలు చేపడుతున్నారు. ఎకరా పంట సాగుకు రూ. 2 లక్షల నుంచి రూ.2.5 లక్షలు ఖర్చు అవుతోందని, ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు దక్కడమే గగనమని రైతులు వాపోతున్నారు.
పది సంవత్సరాలుగా చెరకు సాగు చేస్తున్నా. వ్యాపారులే తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుండడంతో దళారుల బెడదలేదు. కానీ ఈ సంవత్సరం ధర ఆశించిన స్థాయిలో లేదు. గత సంవత్సరంతో పోలిస్తే గడ ఒక్కోటి రూ.4 నుంచి రూ.5 తగ్గింది. పెట్టుబడులు పెరిగాయి. ధర పెరగకపోతే పెట్టుబడులే దక్కుతాయి.
– తాటిపర్తి అంజిరెడ్డి, కూకట్లపల్లి
సారవంతమైన భూములో చెరకు సాగుతో గడల్లో నాణ్యతతో దిగుబడులు బాగున్నాయి. ధర దిగజారడంతో ఆశించిన స్థాయిలో లాభాలు దక్కే పరిస్థితులు కనిపించడం లేదు.
– సుబ్బారావు
చేదెక్కిన నల్ల చెరకు
చేదెక్కిన నల్ల చెరకు


