జిల్లా టీకాల అధికారిగా రత్న మన్మోహన్
బాపట్ల: జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిగా డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఎం జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై బాపట్లకు వచ్చారు. ఈ మేరకు బాపట్ల జిల్లా వ్యాధి నిరోధక టీకాల పంపిణీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా మోహన్‌రాజు
బాపట్ల: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా టి.మోహన్‌రాజు పదవీ బాధ్యతలు చేపట్టారు. బాపట్ల జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఆయన డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్నారు. రెండు సంవత్సరాలు బాపట్ల జిల్లాలో పనిచేశారు. 2024 జనవరిలో జిల్లా పౌర సంబంధాల అధికారిగా పదోన్నతిపై నెల్లూరు జిల్లాకు వెళ్లారు. నవంబర్‌లో డిప్యూటేషన్‌పై జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాపట్ల జిల్లాకు వచ్చారు. బాపట్ల జిల్లా సమాచార శాఖకు పూర్తి అదనపు బాధ్యతలపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సీనియర్ సహాయకులు పద్మావతి, జూనియర్ సహాయకులు రవి, సుభాని, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తైక్వాండోలో రేపల్లె వాసికి రెండు స్వర్ణాలు
నిజాంపట్నం: ఫెడరేషన్ కప్ తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల్లో రేపల్లె వాసి రెండు స్వర్ణ పతకాలు సాధించారు. వరల్డ్ తైక్వాండో ఆధ్వర్యంలో ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన ఈ పోటీల్లో రేపల్లెకు చెందిన రాష్ట్ర తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి కోకిలిగడ్డ వెంకటేశ్వరరావు ప్రతిభ చాటారు. రెండు స్వర్ణ పతకాలు సాధించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ త్వరలో జరిగే అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన్ను పలువురు ప్రముఖులు అభినందించారు.
జిల్లా టీకాల అధికారిగా రత్న మన్మోహన్
జిల్లా టీకాల అధికారిగా రత్న మన్మోహన్


