పచ్చ నేతల పైసావసూల్‌ | - | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల పైసావసూల్‌

Apr 24 2025 1:33 AM | Updated on Apr 24 2025 1:33 AM

పచ్చ

పచ్చ నేతల పైసావసూల్‌

బాపట్ల
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

ముగిసిన ప్రతిష్ట వేడుకలు

శావల్యాపురం: వేల్పూరులోని

గంగమ్మ తల్లి, పోతురాజుల పేర్పిడి ప్రతిష్టా మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. భక్తులు భారీసంఖ్యలో పాల్గొని అమ్మవారిని

దర్శించుకున్నారు.

త్రికోటేశ్వర విగ్రహ పునఃజీవ ప్రతిష్ట

సత్తెనపల్లి: అమ్మిశెట్టి వారి వీధిలోని త్రికోటేశ్వర స్వామి విగ్రహ పునఃజీవ ప్రతిష్ట, దేవాలయం పునర్నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ట బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

రెడ్డి పేరంటాలమ్మకు పూజలు

నాదెండ్ల: సాతులూరులో రూ.2 కోట్లతో నిర్మించిన శ్రీ రెడ్డిపేరంటాలమ్మ ఆలయంలో గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్‌

నడికట్టు రామిరెడ్డి పూజలు నిర్వహించారు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: మత్స్యకారుల వేట నిషేధ భృతిపై పచ్చనేతల కన్నుపడింది. ఇప్పటివరకూ ఇసుక, బుసక, గ్రానైట్‌, గ్రావెల్‌, పేదల బియ్యం మాత్రమే బొక్కుతున్నారు. ఇప్పుడు చేపల వేట జీవనాధారంగా బతికే గంగ పుత్రులకు ప్రభుత్వం ఇచ్చే వేట నిషేధ భృతిని కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేట నిషేధంలో జీవన భృతి కోసం ప్రభుత్వం గంగ పుత్రులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక దీని మాటున డబ్బులు కొట్టేసేందుకు పచ్చ నేతలు సిద్ధమయ్యారు. ఒక్కో బోటుకు ఇద్దరు లేదా ముగ్గురి పేర్లు అదనంగా చేర్చి ఆ మొత్తాన్ని తమకు చెల్లించాలని మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

అధికారులకు బెదిరింపులు

ఇప్పటికే నిజాంపట్నానికి చెందిన ఒక పచ్చ నేత ఏకంగా మత్స్యశాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులను బెదిరించినట్లు ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చెప్పిన పేర్లన్నీ భృతి జాబితాలో ఉండాల్సిందేనని, లేకపోతే ఉండరంటూ సదరు నేత హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే తరహాలో బాపట్ల, చీరాల ప్రాంతాలకు చెందిన మరికొందరు నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. మాట వినకపోతే ఎమ్మెల్యేలు లేదా మంత్రులతో ఫోన్‌లు చేయిస్తామంటూ మత్స్యశాఖ అధికారులను భయభ్రాంతులకు గురి చేసినట్లు సమాచారం. అవసరమైతే కొంతవాటా ఇస్తామని ప్రలోభపెట్టినట్లు సమాచారం. కొందరు ఒత్తిళ్లకు తలొగ్గి వారిచ్చిన పేర్లను జాబితాలో చేర్చినట్లు సమాచారం. బుధవారం సాయంత్రమే జిల్లా నుంచి మత్స్యశాఖ అధికారులు జాబితాను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం.

జాబితా 15 వేలకు చేరే అవకాశం

వాస్తవానికి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2022లో జిల్లా వ్యాప్తంగా 9వేల మందికి, 2023లో 10వేల మంది వరకూ జాబితా సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది 14 వేల మంది పైచిలుకు భృతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాటికి తుది జాబితాను అధికారులు వెల్లడించలేదు. పచ్చనేతల ఒత్తిళ్లతో జాబితా 15 వేలకు చేరే అవకాశమున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వేల సంఖ్యలో పచ్చనేతలు బోగస్‌ మత్స్యకారుల పేర్లను జాబితాలో చేర్చినట్లు అనుమానించాల్సిందే.

జాబితాలో అదనంగా నాలుగు వేల మంది..

గత ప్రభుత్వంలో ఇచ్చిన దానితో పోల్చుకున్నా నాలుగు వేల మందిని అదనంగా జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కొక్కరికీ రూ. 20 వేలు అనుకుంటే నాలుగు వేల మందికి సుమారు రూ. 8 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం పచ్చనేతలు కొట్టేసేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అర్హులైన మత్స్యకారులకు భృతి ఇస్తే సంతోషమే. అలా కాకుండా పచ్చనేతల జేబులు నింపడానికి రూ. కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం సరికాదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరులంటూ పచ్చనేతలు కొందరు అర్హులైన మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, అర్హులైన మత్స్యకారులందరికీ భృతి ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

పచ్చనేతల దోపిడీ ఇలా ...

3

న్యూస్‌రీల్‌

వేట నిషేధ భృతి కొట్టేసేందుకు స్కెచ్‌

తాము చెప్పిన వారికే భరోసా

ఇవ్వాలంటూ హుకుం

అధికారులపై నిజాంపట్నం,

బాపట్ల, చీరాల నేతల ఒత్తిడి

రూ. కోట్లలో ప్రజాధనం

దోపిడీకి రంగం సిద్ధం

జిల్లాలో 2,834 బోట్లు

బోటుకు కనీసం రెండు నుంచి

మూడు అదనపు పేర్ల నమోదు

చేయాలని హుకుం

అర్హులైన మత్స్యకారులకు

మొండి చేయి

పచ్చ నేతల తీరుతో

తలలు పట్టుకుంటున్న అధికారులు

వాస్తవానికి జిల్లాలో నిజాంపట్నం హార్బర్‌, బాపట్ల, చీరాల ప్రాంతాల్లో అధికారికంగా 2,432 మోటరైజ్డ్‌ బోట్లు, 174 మెకనైజ్డ్‌ బోట్లు, 228 నాన్‌ మోటరైజ్డ్‌ బోట్లు కలిపి మొత్తం 2,834 ఉన్నాయి.

మోటరైజ్డ్‌ బోట్లలో ఆరుగురు, మెకనైజ్డ్‌ బోట్లలో ఎనిమిది నుంచి పది మంది, నాన్‌ మోటరైజ్డ్‌ బోట్లలో ముగ్గురు తగ్గకుండా మత్స్యకారులు వేట సాగిస్తారు. పచ్చనేతల ఒత్తిళ్లతో మోటరైజ్డ్‌, మెకనైజ్డ్‌ బోట్లలో అదనంగా ఒక్కో బోటుకు ముగ్గురికి తగ్గకుండా పేర్లను పచ్చనేతలు భృతి జాబితాలో చేర్పించినట్లు సమాచారం.

పచ్చ నేతల పైసావసూల్‌1
1/6

పచ్చ నేతల పైసావసూల్‌

పచ్చ నేతల పైసావసూల్‌2
2/6

పచ్చ నేతల పైసావసూల్‌

పచ్చ నేతల పైసావసూల్‌3
3/6

పచ్చ నేతల పైసావసూల్‌

పచ్చ నేతల పైసావసూల్‌4
4/6

పచ్చ నేతల పైసావసూల్‌

పచ్చ నేతల పైసావసూల్‌5
5/6

పచ్చ నేతల పైసావసూల్‌

పచ్చ నేతల పైసావసూల్‌6
6/6

పచ్చ నేతల పైసావసూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement