
26 నుంచి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
రెంటచింతల: మఠంపల్లి శుభవార్త దేవాలయం తిరునాళ్ల సందర్భంగా శుభోదయ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయ భరత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గాదె పవన్‌రెడ్డి, కార్యదర్శి తానం బాలరెడ్డి తెలిపారు. ఆదివారం రెంటచింతలలో వారు రెవ. ఫాదర్ మార్టిన్ పసల, రెవ.ఫాదర్ అల్లం బాలరెడ్డిలతో కలిసి ఎడ్ల బల ప్రదర్శన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా మండల కేంద్రమైన మఠంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ ఎడ్ల ప్రదర్శనకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే ఎడ్ల యజమానులకు, రైతు సోదరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విభాగంలో 10 బహుమతుల చొప్పున 40 మంది రైతులకు మొత్తం రూ. 8.78 లక్షల నగదును అందచేయనున్నట్లు తెలిపారు. శుభోదయ యువజన సంఘం నాయకులు కందుల కిరణ్ కుమార్‌రెడ్డి, సలిబండ్ల రాజేష్‌రెడ్డి, కొమ్మారెడ్డి రంజిత్‌రెడ్డి, గోపు అఖిల్‌రెడ్డి, గాదె మనీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.