నాకు తోటవారిపాలెం రెవెన్యూ పరిధిలో ఎకరం భూమి ఉంది. మేము 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. నా పేరుతో రికార్డులన్నీ ఉన్నాయి. నా భర్త జేమ్స్ మూడేళ్ల క్రితం చనిపోయారు. నా కొడుక్కి పక్షవాతం వచ్చి మంచంలోనే ఉంటున్నాడు. నేను వ్యవసాయం చేయలేక మూడేళ్ల క్రితం భాగ్యరాజు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాను. మాకు తెలియకుండా మా పొలాన్ని అతనిపేరుతో ఆన్‌లైన్ ఎక్కించుకొని ఏడాది నుంచి కౌలు ఇవ్వడం లేదు. అడిగితే నీకు దిక్కున్నచోట చెప్పుకోమన్నాడు. తహసీల్దార్ దగ్గరకు వెళితే దురుసుగా ప్రవర్తించారు. కాగితాలు నీ మొహాన వేసి కొట్టుకో అంటూ దుర్భాషలాడారు. న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీసుకు ఇప్పటికి మూడు సార్లు వచ్చాను. అయినా పరిష్కారం కాలేదు.
– దేవరపల్లి ఏలిశమ్మ,
బుర్లవారిపాలెం, చీరాల మండలం