
పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోన రఘుపతి
బాపట్లఅర్బన్: బాపట్ల తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం రెండు రోజులు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మండలంలోని అడవిపల్లెపాలెం, అడవి గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే కోన రఘుపతి పరిశీలించారు. సౌకర్యాల కల్పన గురించి ఆరా తీశారు. భయపడొద్దని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని భరోసా కల్పించారు. తుపాను బాధితుల కోసం వండిన ఆహార పదార్థాలను తిని నాణ్యతను పరిశీలించారు. సూర్యలంక తుపాను షెల్టర్‌లో ఉన్న బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు.