దూసుకొచ్చిన మృత్యువు
వినుకొండ: పండుగ వేళ వినుకొండ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. అతివేగంగా దూసుకొచ్చిన ఒక మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒక బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామానికి చెందిన గుంజి శ్రీను, భార్య శ్రీదేవి కుమారులు శ్రీకాంత్, శ్రీహరిలు కలిసి గుంటూరు జిల్లా తెనాలిలోని ఒక శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి వెళు తుండగా ఈ ప్రమాదం జరిగింది. వినుకొండ పట్టణంలోని చెక్‌పోస్ట్ సెంటర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మినీ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడు గుంజి శ్రీహరి (14) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బాలుడు స్థానిక మారెళ్ల జెడ్‌పీహెచ్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మినీ లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నా రు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాంబాబు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరు కున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కొత్తా అంకారావును స్థానికులు విద్యుత్ స్తంభానికి కట్టివేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపి బాలుడి మృతికి కారణమైన డ్రైవర్ ఉదయం ఐదు గంటల నుంచే ప్రమాద స్థలం సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫూటుగా మద్యం తాగి రోడ్డుపై వాహనాలను ఢీకొట్టాడు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన
మినీ లారీ
మద్యం మత్తులో లారీ డ్రైవర్
ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి
దూసుకొచ్చిన మృత్యువు


