బాపట్ల
న్యూస్‌రీల్
సాగర్ నీటిమట్టం
నేడు హుండీ కానుకల లెక్కింపు
మేరి మాత గ్రామోత్సవం
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
క్రీస్తు జననం..లోకానికి పర్వదినం
ఏసు క్రీస్తు జన్మదినాన్ని విశ్వాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి నుంచి బాపట్ల జిల్లాలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురువారం ఉదయం విశ్వాసులు పెద్ద ఎత్తున తరలిరావడంతో చర్చిల వద్ద సందడి నెలకొంది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్దలు సందేశం వినిపించారు. చీరాలలోని 100 సంవత్సరాల చరిత్ర గల సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పెద్దఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. –సాక్షి నెట్‌వర్క్
కారంచేడులో ఏసుక్రీస్తు జననం గురించి
వివరించే సెట్టింగ్
చీరాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న క్రైస్తవులు
బాపట్ల సీబీజడ్ చర్చిలో సందేశం వినిపిస్తున్న పాస్టర్ రెవ.పవిత్రకుమార్
రేపల్లె ఏఈఎల్‌సీ చర్చిలో క్రీస్తు సందేశాన్ని అందిస్తున్న పాస్టర్ మాణిక్యారావు
బాపట్ల ప్రార్థనలో పాల్గొన్న మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విశ్వాసులు
7
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 566.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 51,426 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో హుండీల కానుకల లెక్కింపు శుక్రవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లిలోని ఆర్‌సీఎం చర్చి ఆధ్వర్యంలో గురువారం రాత్రి మేరిమాత గ్రామోత్సవం నిర్వహించారు. విచారణ గురువు దాసయ్య ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు.
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


