ప్రమాద భరితంగా ఘాట్‌ రోడ్‌ మార్గం | - | Sakshi
Sakshi News home page

ప్రమాద భరితంగా ఘాట్‌ రోడ్‌ మార్గం

Dec 26 2025 8:28 AM | Updated on Dec 26 2025 8:28 AM

ప్రమా

ప్రమాద భరితంగా ఘాట్‌ రోడ్‌ మార్గం

ప్రమాద భరితంగా ఘాట్‌ రోడ్‌ మార్గం మంగళగిరి టౌన్‌: మంగళగిరిలో ఎగువ సన్నిధిలో వేంచేసిఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్లే ఘాట్‌రోడ్‌ ప్రమాద భరితంగా మారింది. తరచూ ఘాట్‌రోడ్‌ మార్గంలో బండరాళ్లు జారిపడుతున్నాయి. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్‌రోడ్‌ వెంబడి కొండకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగక ముందే చర్యలు చేపట్టాలని భక్తులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం రానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దేవస్థాన అధికారులు స్పందించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, దేవాలయ పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుకుంటున్నారు. ఆంధ్రరత్న పంట కాలువలో మద్యం సీసాలు తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ పరిధిలోని కుంచనపల్లి నుంచి చిర్రావూరు వరకు రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రరత్న ఎత్తిపోతల పథకం కాలువలో ఎక్కడ చూసినా మద్యం సీసాలు తేలియాడుతున్నాయి. ఎత్తిపోతల పథకం కాలువ పక్కన వైన్‌షాపు ఏర్పాటు చేయడంతో మందు బాబులు ఖాళీచేసిన సీసాలను కాలువలో పడేస్తున్నారు. ఆ సీసాలు రైతుల పంట పొలాల్లోకి వెళుతున్నాయి. పనులు చేసుకుంటున్న సమయంలో ఆ సీసాలు పగిలి గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయిని రైతులు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభాదేవికి డాక్టర్‌ ఉళ్లక్కి స్మారక బంగారు పతకం ప్రదానం పరశురామావతారంలో వేంకటేశ్వరస్వామి

తెనాలి రూరల్‌: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మేజర్‌ కాకుమాను ఉళ్లక్కి వర్థంతి సభ నిర్వహించారు. బోసురోడ్డులోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని డాక్టర్‌ ఉళ్లక్కి సేవలను స్మరించుకున్నారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్యామ్‌ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సభలో విజయవాడకు చెందిన ప్రభ నర్సింగ్‌ హోం వైద్యురాలు కోడె ప్రభాదేవికి డాక్టర్‌ ఉళ్లక్కి స్మారక గోల్డ్‌ మెడల్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘ఎంపవరింగ్‌ హెల్త్‌ ఇన్‌ మిడ్‌ లైఫ్‌’ అనే అంశంపై డాక్టర్‌ ప్రభాదేవి ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్‌ కోటేశ్వరప్రసాద్‌, డాక్టర్‌ జి.రవిశంకరరావు, డాక్టర్‌ టి.అఖిలేష్‌, డాక్టర్‌ కె.అనిల్‌ కుమార్‌, డాక్టర్‌ జి.నరసింహారావు, డాక్టర్‌ పి.ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు.

తెనాలి టౌన్‌: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనులపండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం స్వామివారిని పరశురామావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రమాద భరితంగా  ఘాట్‌ రోడ్‌ మార్గం 1
1/2

ప్రమాద భరితంగా ఘాట్‌ రోడ్‌ మార్గం

ప్రమాద భరితంగా  ఘాట్‌ రోడ్‌ మార్గం 2
2/2

ప్రమాద భరితంగా ఘాట్‌ రోడ్‌ మార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement