ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 04-10-2026 To 10-10-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Oct 4 2026 4:08 AM | Updated on Oct 4 2026 4:08 AM

Weekly Horoscope Telugu 04-10-2026 To 10-10-2026

మేషం...
కొన్ని పనులు నిదానంగా సాగినా సకాలంలోనే పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజకనం. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. పరపతి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు లభిస్తాయి. కళాకారులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో  సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

వృషభం...
ఆర్థికంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి వివాదాలు. నిరుద్యోగులకు కొంత నిరాశ చెందుతారు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై  కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో ఒడిదుడుకులు  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు లేనిపోని సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో ధనలబ్ధి. కొత్త ఒప్పందాలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు.  అంగారక స్తోత్రాలు పఠించండి.

మిథునం...
కొత్త పనులు చేపట్టి  శ్రమపడినా పూర్తి చేస్తారు. వివాహయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ప్రముఖులు పరిచయమవుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తధ్యం. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఐటీ, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం..
అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. అందర్నీ ఆకట్టుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు లభిస్తాయి. భూవివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. బంధువులతో సమావేశమవుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు అనూహ్యంగా అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నీలం రంగులు,  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం...
అనుకున్న విధంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలుగుతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు, లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. నీలం, నేరేడురంగులు.  కనకధారాస్తోత్రాలు పఠించండి.

కన్య...
మొదట్లో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.  పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు కృషి ఫలిస్తుంది.  వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. పసుపు, లేత నీలం రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల....
పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగుచూస్తుంది. వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని క్లిష్ట సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. మీ నిర్ణయాలు అందరూ ప్రశంసిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు రావచ్చు. రాజకీయవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. శివపంచాక్షరి పఠించండి.

వృశ్చికం...
ముఖ్య పనుల్లో మరింత పురోగతి ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు తీరి లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. గృహæ నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగయత్నాలలో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. పారిశ్రామికవేత్తలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో  వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు..
చేపట్టిన పనులు సమయానికి  పూర్తి చేస్తారు. బంధువులతో కొన్ని విషయాలపై చర్చలు జరుపుతారు. సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు అనుకూల సమయం.  వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, లేత పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం...
ఉత్సాహంగా కొన్ని పనుల్లో  విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. గృహ నిర్మాణాలలో ముందడుగు పడుతుంది. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం.  కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం.  ఎరుపు, తెలుపు రంగులు.  దేవీఖడ్గమాల పఠించండి.

కుంభం....
ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. నూతన వ్యక్తులు పరిచయమై సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే  మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కారం. ఒక సమాచారం మీలో సంతోషం కలిగిస్తుంది. ఏ పనులు చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. గులాబీ, లేత ఎరుపు రంగులు.  ఈశ్వరారాధన మంచిది.

మీనం...
కొత్త పనులను నేర్పుగా పూర్తి చేస్తారు.  ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు.  లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement