Weekly Horoscope: ఈ రాశి వారు వారంలో ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు

Weekly Horoscope In Telugu 02-01-2022 to 08-01-2022 - Sakshi

మేషం
ఆర్థిక పరిస్థితి నిరాశ పర్చినా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. æ మిత్రులను కలుసుకుని కీలక విషయాలపై చర్చిస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం
కొన్ని సమస్యలు, వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి రాగలదు. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.  బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహన, గృహయోగాలు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు, బాధ్యతలు తగ్గుతాయి. రాజకీయవేత్తలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఎరుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం
కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. పరిచయాలు పెరుగుతాయి. అదనపు రాబడి ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అనుకోని  పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. అయినవారితో కలహాలు.  ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం
కొన్ని పనులు కొంత నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఆలోచనలు కలసివస్తాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం. కళారంగం వారికి ఒత్తిడుల నుంచి విముక్తి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం
ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఒక వివాదం నుంచి నేర్పుగా బయటపడతారు. స్థిరాస్తి కొంటారు. వ్యాపారాలు çలాభిస్తాయి, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు.  పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కన్య
పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  వ్యాపారాలు ఆశించినరీతిలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి.  పారిశ్రామికవర్గాలకు ముఖ్య వివాదాలు తీరతాయి. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

తుల
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. పాతమిత్రుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాల నుంచి కొంత బయటపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఆర్థికంగా మరింత  ప్రగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు.  వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రావచ్చు. కళాకారులకు కృషి ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్య, కుటుంబ సమస్యలు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలతో కుస్తీపడతారు. విద్యార్థులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. నిరుద్యోగులు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బదిలీ అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.  నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కదలికలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.  వ్యాపారాలు సకాలంలో విస్తరిస్తారు. ఉద్యోగవిధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నేరేడు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం
ఆర్థిక పరిస్థితి గతం కంటే  ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు అన్ని విధాలా కలసివచ్చే కాలం. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో  వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గుతుంది.  కళాకారులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. గులాబీ, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కుంభం
యత్నకార్యసిద్ధి. కుటుంబసభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొంటారు. వివాహయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పైస్థాయి నుంచి పిలుపు రావచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు. సోదరులతో విభేదాలు.  నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మీనం
ముఖ్యమైన పనులు సకాలంలో విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు.  నలుపు, చాక్లెట్‌ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.  దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top