వారంలో ఈ రాశివారికి బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి

Weekly Horoscope From January 3rd To 9th January - Sakshi

వారఫలాలు (03.01.21 నుంచి 09.01.21 వరకు)
మేషం...
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. వాహన, గృహయోగాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఆశాజనకమైన కాలం. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

వృషభం...
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతో విభేదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం...
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. రుణాలు చేస్తారు. నేరేడు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం...
కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వేడుకలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. కళారంగం వారికి కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం...
వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తగ్గే సూచనలు. కళారంగం వారి యత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

కన్య....
చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. వాహనసౌఖ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి.  వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల...
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం, అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం..
దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి విషయాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు, భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. చిరకాల కోరిక నెరవేరే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం...
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి మరిన్ని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కుంభం..
అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ప్రత్యర్థులు సైతం సహాయపడతారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. సోదరులతో వివాదాలు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

మీనం...
నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top