ఈ రాశివారికి శుభవార్తా శ్రవణం.. ధనలాభం

Today Horoscope 06-11-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం తిథి: శు.త్రయోదశి సా.4.25 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం:  రేవతి రా.12.51 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: ప.12.07 నుండి 2.34 వరకు, దుర్ముహూర్తం: సా.3.54 నుండి 4.37 వరకు, అమృతఘడియలు: రా.10.26 నుండి 12.01  వరకు.

సూర్యోదయం :  6.04
సూర్యాస్తమయం :  5.25
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: పనుల్లో ప్రతిష్ఠంభన. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: నూతన ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థిక ప్రగతి ఉంటుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు.

మిథునం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా మారవచ్చు.

సింహం: ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.

కన్య: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యలు, వివాదాలు తీరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తుంది.

ధనుస్సు: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనులలో జాప్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి.

కుంభం: ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. సోదరులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మీనం: వ్యవహారాలలో పురోగతి. ఆకస్మిక ధనలాభం. భూవివాదాలు పరిష్కారం. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top