
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.ఏకాదశి సా.4.09 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఆరుద్ర రా.2.33 వరకు, తదుపరి పునర్వసు,వర్జ్యం: ప.11.45 నుండి 1.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.55 నుండి 11.41 వరకు,అమృత ఘడియలు: సా.5.10 నుండి 6.40 వరకు, సర్వ ఏకాదశి.
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... భవిష్యత్తుపై భరోసా. ప్రముఖుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. విందువినోదాలు. చర్చలు సఫలం. వ్యాపారలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృషభం.... శ్రమ తప్ప ఫలితం ఉండదు. విద్యావకాశాలపై నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మిథునం... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.
కర్కాటకం... రుణబాధలు. సోదరులు, మిత్రుల నుండి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
సింహం... గతం గుర్తుకు వస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. సేవాభావం పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కన్య.... యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుండి విముక్తి.
తుల.... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం... ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు... వ్యవహారాలలో పురోగతి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు పురోగతిలో ఉంటాయి.
మకరం.... వివాదాలు కొన్ని పరిష్కారం. శుభవార్తలు వింటారు. భూలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.
కుంభం.... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. పనుల్లో ప్రతిబంధకాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
మీనం... కుటుంబంలో సమస్యలు. మానసిక ఆందోళన. సోదరుల నుండి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.