ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి | Rasi Phalalu: Daily Horoscope On 25 11 2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి

Nov 25 2025 12:19 AM | Updated on Nov 25 2025 12:19 AM

Rasi Phalalu: Daily Horoscope On 25 11 2025 In Telugu

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం, తిథి: శు.పంచమి రా.6.56 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.9.07 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.1.16 నుండి 2.56 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.09 వరకు, తదుపరి రా.10.27 నుండి 11.18 వరకు, అమృత ఘడియలు: ప.2.13 నుండి 3.54 వరకు.

సూర్యోదయం :    6.13
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం: ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: కొన్ని వ్యవహారాలు నిదానం అవసరం. దూరప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఒప్పందాలు రద్దు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

మిథునం: పనుల్లో ప్రతిష్ఠంభన. శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: చిత్రమైన సంఘటనలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. స్థిరాస్తి వృద్ధి. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ముఖ్య మార్పులు.

కన్య: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

ధనుస్సు: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా నిరుత్సాహం. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధనప్రాప్తి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement