
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.విదియ రా.2.27 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: హస్త ప.1.00 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: రా.9.44 నుండి 11.29 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.07 వరకు, తదుపరి రా.10.46 నుండి 11.33 వరకు, అమృత ఘడియలు: ఉ.6.33 నుండి 8.16 వరకు
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.55
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... కార్యజయం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
వృషభం.... పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధుమిత్రులతో తగాదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
మిథునం.... శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం.... మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. ధనలాభం. చర్చలు ఫలిస్తాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
సింహం.. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
కన్య... పనుల్లో విజయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
తుల.... ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవరోధాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.
వృశ్చికం... బాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు.
ధనుస్సు... పలుకుబడి మరింతగా పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మకరం...... ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
కుంభం.... మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరాశాజనకం.
మీనం.... శుభకార్యాలు నిర్వహిస్తారు. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.