
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: అమావాస్య రా.12.14 వరకు, తదుపరి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: పుబ్బ ఉ.9.55 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: సా.5.20 నుండి 7.11 వరకు, దుర్ముహూర్తం: సా.4.21 నుండి 5.09 వరకు, అమృత ఘడియలు: రా.3.40 నుండి 5.21 వరకు, మహాలయ అమావాస్య.
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.57
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం.... వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.
వృషభం.... వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.
మిథునం.... ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న అభివృద్ధి కనిపిస్తుంది.
కర్కాటకం.... వ్యవహారాలలో ఆటంకాలు. మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
కన్య.... ఊహించని ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగమార్పులు.
తుల... ఆర్థికాభివృద్ధి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
వృశ్చికం.... కొన్ని సమస్యలు తీరి ఒడ్డునపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిళ్లు తొలగుతాయి.
ధనుస్సు... సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అవసరాలకు రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటుంది.
మకరం... వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
కుంభం.... శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యవహారాలు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మీనం......బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలత. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.