
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.నవమి ప.12.03 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: మఖ రా.6.58 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.6.31 నుండి 8.11 వరకు, తదుపరి రా.3.25 నుండి 5.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.49 నుండి 11.33 వరకు, అమృత ఘడియలు: సా.4.02 నుండి 6.10 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.36, సూర్యాస్తమయం: 6.17.
మేషం....నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
వృషభం...సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. స్వల్ప అనారోగ్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
మిథునం.....కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.
కర్కాటకం...వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. దైవచింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
సింహం....పనులు సాఫీగా సాగుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
కన్య....పనులలో జాప్యం. దైవదర్శనాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
తుల....పనులు అనుకున్న రీతిలో పూర్తి. అందరిలోనూ మీమాటే నెగ్గుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం....పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
ధనుస్సు.......మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ప్రయాణాలలో స్వల్ప మార్పులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
మకరం.....ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. స్వల్ప రుగ్మతలు. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించవు.
కుంభం...వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
మీనం....కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.