ఈ రాశి వారు భూములు కొంటారు.. ఆర్థిక ప్రగతి | Rasi Phalalu: Daily Horoscope On 27-08-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు కొంటారు.. ఆర్థిక ప్రగతి

Aug 27 2025 12:56 AM | Updated on Aug 27 2025 10:02 AM

Rasi Phalalu: Daily Horoscope On 27-08-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం,వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.చవితి ప.1.58 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: చిత్త పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.2.31 నుండి 4.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.29 వరకు, అమృత ఘడియలు: రా.1.02 నుండి 2.45 వరకు, వినాయక చవితి.

సూర్యోదయం :  5.48
సూర్యాస్తమయం :  6.17
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. పోటీపరీక్షల్లో విజయం. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు.

వృషభం.... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మిథునం.... సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం.... సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

సింహం.... మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కన్య..... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

తుల.... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం... సన్నిహితులతో సఖ్యత. కొన్ని సమస్యలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పనుల్లో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు.... మిత్రుల నుంచి ఆహ్వానాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహన, గృహయోగాలు.  వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం... ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం... అనుకున్న పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి.

మీనం... కొత్త విషయాలు తెలుస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థిక ప్రగతి. పనులు చకచకా సాగుతాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

Advertisement
 
Advertisement
Advertisement