
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.తదియ ప.12.36 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: హస్త తె.5.45 వరకు(తెల్లవారితే బుధవారం), తదుపరి చిత్త,వర్జ్యం: ప.12.54 నుండి 2.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.55 నుండి 11.41 వరకు, అమృత ఘడియలు: రా.11.20 నుండి 12.58 వరకు.
సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ప.3.00
నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... సన్నిహితులతో సఖ్యత. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
వృషభం.... కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మిథునం.... ఎంత శ్రమ పడ్డా ఫలితం స్వల్పమే. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
కర్కాటకం... చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. చేపట్టిన వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విందువినోదాలు.
సింహం..... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.
కన్య.... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. బంధువులతో సఖ్యత. కొత్త వ్యక్తుల పరిచయం. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
తుల...... మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిళ్లు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
వృశ్చికం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజకుంటాయి.
ధనుస్సు.... కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
మకరం..... శ్రమ తప్ప ఫలితం కనిపించదు.ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు ఒత్తిళ్లు. స్థిరాసి లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
కుంభం... ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే. దూరప్రయాణాలు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
మీనం... నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.