
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.విదియ ప.11.39 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఉత్తర రా.3.50 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: ప.10.05 నుండి 11.47 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.19 వరకు, తదుపరి ప.3.00 నుండి 3.50 వరకు,అమృత ఘడియలు: రా.8.20 నుండి 10.02 వరకు.
సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు. దూరపు బంధువులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు.
వృషభం.... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలలో లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
మిథునం.... రుణాలు చేస్తారు. పనుల్లో మరింత జాప్యం. బంధు,మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.
కర్కాటకం.... నూతన ఉద్యోగాలు లభిస్తాయి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలమైన పరిణామాలు. సంఘంలో గౌరవం.
సింహం.... పరిస్థితులు అనుకూలించవు. వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం.. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.
కన్య.... కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
తుల... శ్రమ తప్ప ఫలితం ఉండదు. రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా.
వృశ్చికం.... ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. పాతబాకీలు కౌన్ని వసూలవుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.
ధనుస్సు... పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి సాధిస్తారు.
మకరం.... మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
కుంభం... పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు మోయాల్సివస్తుంది.
మీనం..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు. పరపతి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.