
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.త్రయోదశి ప.12.54 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: శతభిషం ఉ.6.45 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: ప.12.58 నుండి 2.30 వరకు, దుర్ముహూర్తం: సా.4.11 నుండి 4.56 వరకు, అమృత ఘడియలు: రా.10.16 నుండి 11.50 వరకు.
సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం : 5.45
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం... సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన విద్యావకాశాలు.
వృషభం.. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. అరుదైన సన్మానాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు. ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు. విందువినోదాలు.
మిథునం.... పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా చికాకులు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. బంధువులతో అకారణంగా తగాదాలు.
కర్కాటకం..... ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ధన వ్యయం. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి..
సింహం.... ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల యత్నాలు సఫలం.
కన్య.... నూతన వ్యక్తుల పరిచయం. విద్య, ఉద్యోగావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. విందువినోదాలు.
తుల... అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా లేనిపోని సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
వృశ్చికం.... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాల కోసం యత్నాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం.
ధనుస్సు...... కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కొత్త విషయాలు తెలుస్తాయి. దైవచింతన.
మకరం.... శ్రమ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కళాకారులకు సన్మానాలు.
కుంభం.... పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి.
మీనం... కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలలో మార్పులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత శ్రమపడాలి.