ఈ రాశి వారికి స్థిరాస్తి లాభం.. యత్నకార్యసిద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 04-10-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి స్థిరాస్తి లాభం.. యత్నకార్యసిద్ధి

Oct 4 2026 3:06 AM | Updated on Oct 4 2026 3:06 AM

గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.అష్టమి ఉ.7.32 వరకు, తదుపరి నవమి తె.5.13 వరకు (తెల్లవారితే సోమవారం), నక్షత్రం: పునర్వసు రా.2.32 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ప.3.21 నుండి 4.50 వరకు, దుర్ముహూర్తం: సా.4.11 నుండి 4.58 వరకు, అమృత ఘడియలు: రా.12.18 నుండి 1.46 వరకు.

సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం : 5.47
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం.... ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. ఆలయాల సదర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.

వృషభం... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనుకోని ఖర్చులు. మిత్రులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

మిథునం... శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కర్కాటకం.... వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం... బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

కన్య..... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల.... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం.  వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. విద్యార్థులకు కొంత నిరాశ. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.

ధనుస్సు..... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. విద్య, ఉద్యోగావకాశాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం... దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి లాభం. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కుంభం... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మీనం.... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. కీలక నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement