ఈ రాశివారికి అనుకోని ధనవ్యయం

Daily Horoscope In Telugu 13-08-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.పంచమి ప.2.11 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం హస్త ఉ.9.24 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం సా.5.07 నుండి 6.37 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.06 వరకు తదుపరి ప.12.30 నుండి 1.21 వరకు, అమృతఘడియలు... రా.2.21 నుండి 3.54 వరకు, గరుడపంచమి, నాగపంచమి.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం     :  6.24
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: పనుల్లో విజయం. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.« ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని పొరపాట్లు.

మిథునం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆశ్చర్యరమైన మార్పులు.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: బంధువులను కలుసుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

తుల: వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో అవాంతరాలు. రుణబాధలు పెరుగుతాయి. మానసిక అశాంతి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సందేశం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మకరం: మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.

కుంభం: వ్యవహారాలు నిదానిస్తాయి. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు కొన్ని వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top