Rashi Phalalu: ఈ రాశివారికి ధనలాభం.. వ్యాపార ఉద్యోగాల్లో ఉపశమనం | Today Telugu Horoscope On September 25th 2023: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఇవాళ ఈ రాశివారికి ధనలాభం, వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి

Published Mon, Sep 25 2023 7:09 AM

Daily-horoscope-25-09-2023-rashi-phalalu-telugu - Sakshi

గ్రహఫలం...సోమవారం, 25.09.23

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం,
సూర్యోదయం: 5.52, సూర్యాస్తమయం: 5.53. 
తిథి: శు.ఏకాదశి రా.1.36 వరకు, తదుపరి ద్వాదశి,
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.17 వరకు, తదుపరి శ్రవణం,


వర్జ్యం: ప.1.02 నుండి 2.32 వరకు,
దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.05 వరకు, తదుపరి ప.2.41 నుండి 3.27 వరకు,
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,


అమృతఘడియలు: రా.10.01 నుండి 11.31 వరకు;

మేషం: కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. సంఘంలో ఆదరణ. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

వృషభం: ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మిథునం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఇంటాబయటా బాధ్యతలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దైవదర్శనాలు.

కర్కాటకం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సాయం అందుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. 

సింహం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కన్య: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తివృద్ధి.

తుల: శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

మకరం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం. అనారోగ్యం.

మీనం: నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement