వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ అభ్యర్థులను గెలిపించాలి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ అభ్యర్థులను గెలిపించాలి

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

సాక్షి, మదనపల్లె : మదనపల్లె మండలంలో వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చే సర్పంచ్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజంపేట ఎంపీ, లోక్‌ సభలో వైఎస్సార్‌సీపీ పక్షనేత మిథున్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి ఆయన మదనపల్లెకు వచ్చారు. ఈ సందర్భంగా కర్ణాటక సరిహద్దులోని చీకలబైలు వద్ద సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు షమీంఅస్లాం, ఏపీ బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు జన్నే శేషాచలపతి, పరిశీలకులు బావాజాన్‌, దేవతా సతీష్‌, రాఘవరెడ్డి, బాబు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు,ప్రజలు ఎంపీకీ ఘన స్వాగతం పలికారు. అభిమానులు జై జగన్‌, జై మిథున్‌ రెడ్డి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 25 గ్రామపంచాయతీ సర్పంచ్‌లను, వార్డు సభ్యులను గె లిపించుకోవాల్సినబాధ్యతఅందరిపై ఉందని అన్నారు. కూటమి అరాచకాలను ఎదుర్కోవాలి

రాజంపేట : పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల్లో బరిలో ఉన్న పార్టీ మద్దతుదారులకు అండగా నిలవాలన్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి,అభ్యర్థుల గుర్తులను ప్రచారం చేయాలని సూచించారు. క్యాడర్‌ వెనకడుగు వేయకుండా కూటమి కుతంత్రాలను ఎదుర్కొని సర్పంచ్‌,వార్డు సభ్యులను గెలిపించాలన్నారు. 2029లో మళ్లీ జగనన్న సీఎం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

ఎంపీ మిథున్‌ రెడ్డి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement