ఆడుకుంటూ.. అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

ఆడుకుంటూ.. అనంతలోకాలకు..

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

● మైదానంలో కుప్పకూలిన విద్యార్థి

● చికిత్స పొందుతూ మృతి

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలో ఆదివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మైదానంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇంటర్మీడియట్‌ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి వరకు తమతో ఎంతో ఉత్సాహంగా ఆడుకున్న మిత్రుడు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడం తోటి విద్యార్థులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడి కుటుంబీకుల కథనం మేరకు.. మదనపల్లె శివనగర్‌లో నివాసం ఉంటున్న గుర్రంకొండకు చెందిన ఎకై ్సజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసులు కుమారుడు జస్వంత్‌ (17) స్థానిక జీఆర్‌టీ గ్రౌండ్‌లో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో తోటి విద్యార్థులు, స్థానికులు వెంటనే ఆ బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంటర్‌ చదువుతున్న జస్వంత్‌ అకాల మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగానే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement