● నిందితుడి అరెస్ట్
పులిచెర్ల(రొంపిచెర్ల) : బెల్ట్ షాపుపై దాడి చేసి 184 సీసాల మద్యం స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు కల్లూరు సీఐ ప్రసాద్‌రావు తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులిచెర్లలో బెల్ట్‌షాపులో మద్యం విక్రయిస్తున్నారని అందిన రహస్య సమాచారం మేరకు దాడి చేసినట్లు తెలిపారు. సరస్వతమ్మ బెల్ట్ షాపులో 184 సీసాల మద్యం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మద్యం విలువ రూ.30 వేలు ఉంటుందన్నారు. ఈ దాడిలో అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం టేకులవారిపల్లెకు చెందిన సురేంద్ర అనే నిందితుడిని అరెస్టు చేసి పాకాల కోర్టులో హాజర పరిచినట్లు తెలిపారు. నిందితుడికి జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా మద్యం విక్రయిస్తే.. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ దాడిలో కల్లూరు ఎస్ఐ వెంకటసుబ్బయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


